ఆదివారం 06 డిసెంబర్ 2020
Telangana - Nov 07, 2020 , 14:45:19

సీఎంఆర్‌ఎఫ్‌కు దక్కన్‌ సిమెంట్స్‌ రూ.25లక్షల విరాళం

సీఎంఆర్‌ఎఫ్‌కు దక్కన్‌ సిమెంట్స్‌ రూ.25లక్షల విరాళం

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి సహాయ నిధికి దక్కన్‌ సిమెంట్స్‌ లిమిటెడ్‌ రూ.25లక్షల విరాళం ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ డైరెక్టర్‌ (వర్క్స్‌) ఎస్‌ వెంకటేశర్లు, కార్పొరేట్‌ సర్వీసెస్‌ మేనేజర్‌ అనిరుధ్‌ చెక్కును శనివారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జయేశ్‌ రంజన్‌, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి (ఫైనాన్స్‌) రోనాల్డ్‌ రోజ్‌ ఉన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.