ఆదివారం 17 జనవరి 2021
Telangana - Nov 30, 2020 , 20:33:02

టీఆర్ఎస్‌కు ఓటు వేయాల్సిందిగా ప్ర‌కాష్‌రాజ్ విజ్ఞ‌ప్తి

టీఆర్ఎస్‌కు ఓటు వేయాల్సిందిగా ప్ర‌కాష్‌రాజ్ విజ్ఞ‌ప్తి

హైద‌రాబాద్ : మంగళవారం జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో న‌గ‌ర ప్ర‌జ‌లు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా నటుడు ప్రకాష్‌రాజ్ విజ్ఞ‌ప్తి చేశారు. ట్విట్ట‌ర్ ద్వారా ఆయ‌న స్పందిస్తూ... విభ‌జ‌న రాజ‌కీయాలు చేసే పార్టీల‌కు కాకుండా సామ‌ర‌స్యం కోసం ప‌నిచేసే పార్టీకి ద‌య‌చేసి అండ‌గా ఉండాల్సిందిగా హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు ఆయ‌న‌ విజ్ఞ‌ప్తి చేశారు. తాను టీఆర్ఎస్ వెంటేన‌న్నారు. సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌, టీఆర్ఎస్‌తో నిల‌బ‌డ‌తాన‌న్నారు.