సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 01, 2020 , 14:37:29

ప్లాట్ల లేఅవుట్ల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు మ‌రో అవ‌కాశం

ప్లాట్ల లేఅవుట్ల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు మ‌రో అవ‌కాశం

హైద‌రాబాద్ : రాష్ర్టంలో ప్లాట్ల లేఅవుట్ల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు మ‌రోమారు ప్ర‌భుత్వం అవ‌కాశం ఇచ్చింది. భూముల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు అవ‌కాశం ఇస్తూ పుర‌పాల‌క శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. హెచ్ఎండీఏ స‌హా కార్పొరేష‌న్లు, పుర‌పాలిక‌ల్లో ఎల్ఆర్ఎస్ కు అవ‌కాశం ఇచ్చింది. గ‌త నెల 26 వ‌ర‌కు అభివృద్ధి చేసిన లేఅవుట్లు, విక్ర‌యించిన ప్లాట్ల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు అవ‌కాశం ఇచ్చింది. క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ కోసం ఆన్‌లైన్ ద్వారా అక్టోబ‌ర్ 15 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుకు అవ‌కాశం క‌ల్పించింది. రాష్ర్టంలోని అన్ని ప‌ట్ట‌ణ‌, గ్రామీణ ప్రాంతాల్లో ఎల్ఆర్ఎస్ కు అవ‌కాశ‌మిచ్చింది. అనుమ‌తులు లేని ప్లాట్లు, లే అవుట్లు క్ర‌మ‌బ‌ద్దీక‌రించుకోక‌పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. క్ర‌మ‌బ‌ద్దీక‌రించుకోని వారికి తాగునీటి, డ్రైనేజీ సౌక‌ర్యం ఉండ‌బోద‌ని స్ప‌ష్టం చేసింది ప్ర‌భుత్వం. అనుమతులు లేని, క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ లేని ప్లాట్ల క్ర‌య‌విక్ర‌యాలపై ప్ర‌భుత్వం నిషేధం విధించ‌డంతో పాటు అలాంటి ప్లాట్ల‌లో భ‌వ‌న నిర్మాణాల‌కు అనుమ‌తులు ఉండ‌వ‌ని తేల్చిచెప్పింది. 

క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ రుసుం : 

వ‌ంద‌లోపు ప్ర‌తి చ‌.మీ.ల‌కు రూ. 200

101 నుంచి 300 లోపు ప్ర‌తి చ‌.మీ.ల‌కు రూ. 400

301 నుంచి 500 లోపు ప్ర‌తి చ‌.మీ.ల‌కు రూ. 600

500 పైన ప్ర‌తి చ‌.మీ.ల‌కు రూ. 750

మురికివాడ‌ల్లో చ‌.మీ.ల‌కు క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ రుసుం రూ. 5

ప్లాట్ల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు ద‌ర‌ఖాస్తు రుసుం రూ. 1000

లే అవుట్ల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు ద‌ర‌ఖాస్తు రుసుం రూ. 10,000


logo