శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Sep 25, 2020 , 09:03:49

సాగర్‌ ఎడమ కాల్వలోకి దూసుకెళ్లిన డీసీఎం

సాగర్‌ ఎడమ కాల్వలోకి దూసుకెళ్లిన డీసీఎం

నల్లగొండ : డీసీఎం అదుపుతప్పి సాగర్‌ ఎడమకాల్వ బ్రిడ్జీ పైనుంచి కాల్వలోకి పల్టీకొట్టింది. నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్ర శివారులో అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దాచేపల్లి నుంచి మిరపకాయల లోడుతో నల్లగొండ వైపు వెళ్తున్న డీసీఎంకు వేములపల్లి శివారులో సాగర్‌ ఎడమకాల్వ వంతెనపై కారు అడ్డువచ్చింది. కారును తప్పించే క్రమంలో డీసీఎం అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టి కాల్వలో పడింది. ప్రవాహ ఉధృతిలో వాహనం కొట్టుకుపోతుండగా డ్రైవర్‌ను స్థానికులు అతికష్టం మీద కాపాడారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సుధీర్‌కుమార్‌ తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.