సోమవారం 23 నవంబర్ 2020
Telangana - Nov 02, 2020 , 07:17:03

క‌ట్టంగూర్‌లో రోడ్డు ప్ర‌మాదం.. మ‌హిళ మృతి

క‌ట్టంగూర్‌లో రోడ్డు ప్ర‌మాదం.. మ‌హిళ మృతి

న‌ల్ల‌గొండ‌: జిల్లాలోని కట్టంగూర్‌లో జాతీయ ర‌హ‌దారిపై డీసీఎం, కారు ఢీకొన్నాయి. దీంతో కారులో ప్ర‌యాణిస్తున్న‌ ఓ మ‌హిళ అక్క‌డిక‌క్క‌డే మృతిచెందింది. మ‌రో ముగ్గురు గాయ‌ప‌డ్డారు. క‌ట్టంగూరు మండ‌లంలోని అయిటిపాముల వ‌ద్ద ఇవాళ ఉద‌యం ఖ‌మ్మం నుంచి వ‌స్తున్న ఓ కారును డీసీఎం ఢీకొట్టింది. దీంతో ఓ మ‌హిళ మృతి చెంద‌గా, తండ్రి, ఇద్ద‌రు కుమార్తెల‌కు గాయాల‌య్యాయి. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు క్ష‌త‌గాత్రుల‌ను న‌కిరేక‌ల్ ప్ర‌భుత్వ ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. బాధితులు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా షాద్‌న‌గ‌ర్‌కు చెందిన‌వారిగా గుర్తించారు. ఖమ్మంలోని బంధువుల ఇంటికి వెళ్లొస్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింద‌ని తెలిపారు.