శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Mar 01, 2020 , 02:00:45

తొలిసారి ఏకపక్షంగా తీర్పు

తొలిసారి ఏకపక్షంగా తీర్పు
  • మీడియా సమావేశంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: డీసీసీబీలు, డీసీఎంస్‌లు ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం సహకార సంఘాల చరిత్రలో ఇదే తొలిసారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. రైతులంతా ఏకపక్షంగా తీర్పునిచ్చారన్నారు. డీసీసీబీ, డీసీఎం ఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక తర్వాత మంత్రులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని రైతులంతా సీఎం కేసీఆర్‌కు అండగా నిలిచారన్నారు. 


సహకార సంఘాల వ్యవస్థ బలోపేతం చేసేందుకు రైతులకు సేవలందించేందుకు కొత్త పాలకవర్గాలు కృషి చేయాలని కోరారు. డీసీసీసీబీ, డీసీఎంఎస్‌ పదవుల్లో అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి పేర్కొన్నారు. సహకార సంఘాల ద్వారా ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లు, చేపడతామన్నారు. కార్యక్రమంలో ఎంపీ బండా ప్రకాశ్‌, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


logo