గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Feb 18, 2020 , 01:34:55

డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికలకు కసరత్తు

డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికలకు కసరత్తు
  • 9 డీసీసీబీ, 9 డీసీఎంఎస్‌లకు జరుగనున్న ఎన్నిక
  • 20న నోటిఫికేషన్‌.. 28, 29 తేదీల్లో ఎన్నికలు?

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్యాక్స్‌ ఎన్నికలు ముగియడంతో జిల్లా సహకారకేంద్ర బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌)ల ఎన్నికల నిర్వహణపై సహకారశాఖ కసరత్తు ప్రారంభమైంది. ఓటర్ల జాబితా రూపకల్పనకు అనుసరించాల్సిన విధానాలపై జిల్లా సహకారశాఖ అధికారులతో సమావేశమైన సహకారశాఖ కమిషనర్‌ పలు సూచనలు చేసినట్టు సమాచారం. రాష్ట్రంలోని 9 డీసీసీబీ, 9 డీసీఎంఎస్‌లకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈ నెల 20న నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. అంతా సవ్యంగా సాగితే ఈ నెల 28, 29 తేదీల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది. ప్రతి డీసీసీబీలో 20 మంది డైరెక్టర్లు, డీసీఎంఎస్‌లో 10 మంది డైరెక్టర్లు ఉంటారు. డీసీసీబీలో 14 మంది డైరెక్టర్లను ప్యాక్స్‌ చైర్మన్లు ఎన్నుకోగా.. మరో ఆరుగురిని ఇతర సహకార సంఘాల చైర్మన్లు ఎన్నుకుంటారు. డీసీఎంఎస్‌లో ఆరుగురిని ప్యాక్స్‌ చైర్మన్లు, నలుగురిని ఇతర సహకార సంఘాల చైర్మన్లు ఎన్నుకుంటారు. డీసీసీబీ, డీసీఎంఎస్‌ల చైర్మన్లు టెస్కాబ్‌, మార్క్‌ఫెడ్‌  చైర్మన్లను ఎన్నుకుంటారు. 


logo