శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Aug 14, 2020 , 15:56:39

డీబీఎం 71కు గండి.. క్షణాల్లో అక్కడికి చేరి మరమ్మతులు చేయించిన మంత్రి జగదీశ్‌రెడ్డి

డీబీఎం 71కు గండి.. క్షణాల్లో అక్కడికి చేరి మరమ్మతులు చేయించిన మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట : సూర్యాపేట జిల్లాకు పరుగులు పెడుతున్న కాళేశ్వరం జలాలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం వద్ద డిస్ట్రిబ్యూటర్ మేజర్ 71 కాల్వకు శుక్రవారం ఉదయం గండి పడింది. 

విషయం తెలుసుకున్న వెంటనే రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్‌తో కలిసి ఆఘమేఘాల మీద గండి పడిన కాల్వ వద్దకు చేరుకున్నారు. జోరు వర్షాన్నిసైతం లెక్కచేయకుండా అప్పటికప్పుడు నీటిపారుదల శాఖ అధికారులను కాల్వ వద్దకు రప్పించి పరిస్థితులను సమీక్షించి మరమ్మతు పనులను ప్రారంభించారు. కాల్వకు గండి పడిందని తెలుసుకున్న ఆయకట్టు రైతాంగం ఆందోళన చెందుతున్న కొద్దీ సేపట్లోనే మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కిశోర్‌ సహా నీటిపారుదల శాఖ అధికారులు రంగంలోకి దిగి మరమ్మతులు చేపించడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo