శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Jan 28, 2020 , 00:50:28

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
  • తుఫాన్‌ వ్యతిరేకగాలులే కారణం
  • హైదరాబాద్‌లో మొదలైన ఉక్కపోత

హైదరాబాద్‌/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో రెండ్రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉన్నప్పటికీ, చాలాప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు డిగ్రీలవరకు అధికంగా నమోదవుతున్నాయి. మధ్యభారతదేశంలో ఏర్పడిన తుఫాన్‌ వ్యతిరేకగాలుల వల్ల ఎండ లు పెరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. తుఫాన్‌ వ్యతిరేక వాతావరణం వల్ల గాలిలో తేమ తగ్గి, మేఘాలు ఏర్పడటంలేదని, దీంతో సూర్యరశ్మి నేరుగా భూమిపై పడుతున్నదని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. మరో రెండ్రోజుల వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని చెప్పారు. హైదరాబాద్‌లో అప్పుడే వేసవి ప్రభావం మొదలైంది. రాత్రి చలిగా ఉంటున్నప్పటికీ, మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరుగుతున్నది. దీంతో ఉక్కపోత మొదలైంది. సోమవారం ఖమ్మంలో 33.2, భద్రాచలంలో 32.6, హైదరాబాద్‌ 32.5, మెదక్‌లో 32, రామగుండంలో 31.8, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌లో 31.5,  హకీంపేటలో 31.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. 


logo