బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 30, 2020 , 01:06:32

కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం

కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం

  • రెండ్రోజులు ఓ మోస్తరు వర్షాలు 

హైదరాబాద్‌/ హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఉత్తర మధ్యప్రదేశ్‌ మధ్య ప్రాంతం, ఆ పరిసరాలను ఆనుకుని దక్షిణ ఉత్తరప్రదేశ్‌ ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఉన్నది. మరోవైపు, ఉత్తర కోస్తా తమిళనాడు నుంచి కొమొరిన్‌ ప్రాంతం దాకా 0.9 కిలోమీటర్ల ఎత్తువరకు ఉత్తర-దక్షిణ ద్రోణి కొనసాగుతున్నది. వీటి ప్రభావంతో ఆదివారం రాష్ట్రంలోని చాలాచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. సోమవారం అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు చెప్పారు. శుక్రవారం ఉదయంనుంచి శనివారం ఉదయం వరకు సూర్యాపేట జిల్లా నూతనకల్‌లో అత్యధికంగా 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదివారం గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఓ మోస్తరు వర్షాలు కురువొచ్చని రాజారావు తెలిపారు.


logo