శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Dec 29, 2020 , 22:09:46

అత్తముక్కు కొరికిన కోడలు.. ఏడుకుట్లు వేసిన వైద్యులు

అత్తముక్కు కొరికిన కోడలు.. ఏడుకుట్లు వేసిన వైద్యులు

జోగుళాంబ గద్వాల‌ :  కోడలిని వేధించి.. కొట్టి రాచిరంపాన పెట్టిన అత్తల్ని చూశాం. కానీ అది గతం.. ఇప్పుడు తరం మారింది.  కాస్త విసుగు తెప్పిస్తే కోడల్లే అత్తలపై విరుచుకుపడుతున్నారు. అత్తపై కోడలు దాడి చేసి ముక్కు కొరికి తీవ్రంగా గాయపరిచిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  మానవపాడు గ్రామంలోని మంగలి వీధిలో నివాసం ఉండే శారదమ్మ, జయ్యన్న దంపతులకు ప్రసాద్, భాస్కర్, శేఖర్‌ కుమారులు.

పెద్ద కుమారుడు ప్రసాద్‌ కర్నూల్‌లో అత్తగారి ఇంటి వద్ద ఉంటున్నాడు. మిగిలిన ఇద్దరు స్థానికంగా నివాసం ఉంటున్నారు. వీరి నడుమ తరచూ కలహాలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం మరోసారి గొడవపడ్డారు. దీంతో చిన్న కుమారుడు శేఖర్‌ భార్య రేవతి ఆగ్రహంతో అత్త శారదమ్మ ముక్కు కొరికింది. తీవ్రరక్తస్రావం కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ముక్కు తెగిపోవడంతో వైద్యులు ఏడు కుట్లు వేశారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 


logo