ఆదివారం 17 జనవరి 2021
Telangana - Nov 26, 2020 , 20:02:28

హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారిగా దాసరి బాలయ్య

హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారిగా దాసరి బాలయ్య

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారిగా దాసరి బాలయ్య నియమితులయ్యారు. ప్రస్తుత పాస్‌పోర్ట్‌ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి ఢిల్లీలోని విదేశీ వ్యవహారాలశాఖకు బదిలీ అయ్యరు. భువనేశ్వర్‌ జీఎస్టీ కార్యాలయంలో సంయుక్త కమిషనర్‌గా పనిచేస్తూ బాలయ్య డిప్యూటేషన్‌పై ఇక్కడికి వచ్చారు. ఆయన మూడేళ్లపాటు ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారిగా పనిచేయనున్నారు. బాలయ్య గతంలో శంషాబాద్‌ విమానాశ్రయం కస్టమ్స్‌ విభాగంలో డిప్యూటీ కమిషనర్‌గా అదేవిధంగా సికింద్రాబాద్‌ జీఎస్టీ కార్యాలయ సంయుక్త కమిషనర్‌గా పనిచేశాడు.