మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Oct 24, 2020 , 12:09:21

సింగరేణిలో 26న దసరా సెలవు

సింగరేణిలో 26న దసరా సెలవు

మంచిర్యాల : సింగరేణి కార్మికుల‌కు శుభ‌వార్త‌. ఈ నెల 25న దసరా సెలవు ఉండగా దానిని 26 కు మార్చాలని కార్మిక సంఘ నేతలు సింగ‌రేణి యాజ‌మాన్యానికి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ క్ర‌మంలో సెల‌వును 25వ తేదీ నుంచి 26కు మారుస్తూ సింగ‌రేణి బోర్డు నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సైతం 26వ తేదీన సెలవు ప్రకటించాయి. తమ విజ్ఞప్తి మేరకు 26వ తేదీకి సెల‌వు మార్చినందున యాజమాన్యానికి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి కార్మికుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.