బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 09, 2020 , 08:16:41

మూడ్రోజులు యాదాద్రిలో దర్శనాలు నిలిపివేత

మూడ్రోజులు యాదాద్రిలో దర్శనాలు నిలిపివేత

హైదరాబాద్‌ : నేటి నుంచి మూడు రోజుల పాటు యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో దర్శనాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. స్వామి వారి నిత్య కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహించనున్నారు. అలాగే ఆన్‌లైన్‌ సేవలు, దర్శనాలు భక్తులకు అందుబాటులో ఉంటాయని అధికారులు చెప్పారు. అలాగే పాతగుట్ట లక్ష్మీనృసింహస్వామి ఆలయంలోనూ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, యాదగిరిగుట్టలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దర్శనాలు నిలిపివేయాలని ఇప్పటికే పలు పార్టీల నాయకులు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతకు వినతి పత్రాలు అందజేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ప్రజాప్రతినిధులు, స్థానికులు లాక్‌డౌన్‌ విధించాలని కోరారని విప్‌ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ప్రధానార్చకులతో పాటు మరో ఇద్దరు అర్చకులు, ఉద్యోగికి వైరస్‌ సోకవడంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు మూడు రోజుల పాటు దర్శనాలు నిలిపివేయాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo