సోమవారం 25 జనవరి 2021
Telangana - Dec 22, 2020 , 22:24:01

తల్వార్లతో నృత్యాలు.. కేసు నమోదు

తల్వార్లతో నృత్యాలు.. కేసు నమోదు

జగిత్యాల : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పర్యటనలో కొంతమంది యువకులు తల్వార్లతో నృత్యం చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. యువకులు తల్వార్లు తిప్పుతూ నృత్యాలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సుమోటోగా స్వీకరించి పోలీసులు కేసు నమోదు చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఆవిష్కరణకు మంగళవారం ఎంపీ అరవింద్ హాజరయ్యారు. కార్యక్రమంలో అత్యుత్సాహం ప్రదర్శించిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు డీజే సౌండ్లతో తల్వార్లను గాలిలో తిప్పుతూ చిందులేశారు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టుచేయడంతో వైరల్‌గా మారాయి. దీంతో రాయికల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo