శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Aug 24, 2020 , 12:59:48

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించి మొక్క‌లు నాటిన శేఖ‌ర్ మాస్ట‌ర్‌

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించి మొక్క‌లు నాటిన శేఖ‌ర్ మాస్ట‌ర్‌

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌గారు మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్‌లో ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ శేఖ‌ర్ మాస్ట‌ర్ మొక్క‌లు నాటారు. ఒక‌రితో మొద‌లుపెట్టి దేశ‌వ్యాప్తంగా విస్త‌రించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. యాంక‌ర్ ప్ర‌దీప్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీక‌రిస్తూ జూబ్లిహిల్స్‌లోని పార్క్‌‌లో మొక్క‌లు నాటారు మాస్ట‌ర్‌.

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌గారు ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని  కోరుకుంటున్నాన‌న్నారు శేఖ‌ర్ మాస్ట‌ర్‌. ప్రతి ఒక్క డాన్సర్‌లు   గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిస్తూ మరో ముగ్గురు కొరియోగ్రాఫర్‌లు సత్యం , బాబా భాస్కర్ , రఘుల‌ను ఛాలెంజ్‌కు నామినేట్ చేశారు. వీరు కూడా మొక్క‌లు నాటాల‌ని పిలుపునిచ్చారు. 


logo