దళితులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో చేస్తంది. రోడ్లు, డ్రైనేజీలు వేయిస్తన్రు. పథకాలు, పింఛన్లు బాగున్నయ్. ఆడపిల్లల పెండ్లిలైతే కట్నం ఇత్తండు. అన్నలాగా ఆదు కుంటున్నడు. లేనోల్లకు ఏదైనా జేత్తండు. ఇంగ మా దళితుల కోస మైతే పోరాడుతుండు. మనం గూడా ఆయన కోసం ఆలోచించాలే. అంతకు ముందోళ్లు ఏంజేసిన్రో మనకెరుకే. ఇప్పుడింతజెత్తన్న కేసీఆర్ సార్‌కు మద్ద తియ్యాలే. మన కోసం చేసే ఆయన వెంటుందం. గెలిపిచ్చుకుందం.- మారెపల్లి రాజమణి, పెద్దంపల్లి (జమ్మికుంట)
కేసీఆర్ మాట తప్పే మనిషి కాదు..
కమలాపూర్: టీఆర్ఎస్కు సపోటుగా ఉండాలనుకుంటున్నా. ఇప్పటికే ఎన్నో పథకాలు పెట్టి అమలు చేస్తున్రు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటంటే మాటే. పక్కకు తప్పుకునే మనిషి కాదు. దళితులు బాగు పడాలనే కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తన్నడు. దళితుల కోసం మొండిగా నిర్ణయం తీసుకున్నడు. లీడర్లకే వస్తయి, పేదోళ్లకు రావని పుకార్లు వుట్టిస్తున్రు.. అలాంటివి నమ్మద్దు. అర్హ్హత ఉన్న ప్రతి కుటుంబానికీ పైసలిస్తమని కేసీఆర్ చెప్పిండు. దళితుల కోసం నిర్ణయం తీసుకున్నందుకు అండగా నిలిచి కేసీఆర్‌కే ఓటు వేయాలి. – ఒస్కుల సునీత, కమలాపూర్