బుధవారం 03 జూన్ 2020
Telangana - May 02, 2020 , 22:37:45

పాల వ్యాపారులకు ఊరట

పాల వ్యాపారులకు ఊరట

హైదరాబాద్ : నగరంలో పాల వ్యాపారులు సాయంత్రం 6 గంటల వరకు పాలను సరఫరా చేయవచ్చని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పాల వ్యాపారులను మధ్యాహ్నం ఒంటి గంటకే కట్టడి చేస్తున్నారని, పాల సరఫరాతో పాటు పశువు గ్రాసం తీసికెళ్లడంలోను ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ ఆల్‌ ఇండియా యాదవ మహాసభ హైదరాబాద్‌ పోలీసులకు కమిషనర్‌ దృష్టికి తీసికెళ్లింది. దీంతో సీపీ స్పందిస్తూ పాల వ్యాపారులు, పశు గ్రాసంతో వచ్చే వాహనాలకు సాయంత్రం వరకు ఎలాంటి ఇబ్బందులు కల్గించవద్దని అన్ని పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓలకు అపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. logo