గురువారం 02 జూలై 2020
Telangana - Apr 03, 2020 , 17:41:55

కూలీ పనిచేస్తున్నా బాధ్యత తెలిసిన మనిషి...

కూలీ పనిచేస్తున్నా బాధ్యత తెలిసిన మనిషి...

నారాయణపేట: జిల్లాకు చెందిన మాగనూరు మండలం భైరంపల్లికి చెందిన కుర్వ హన్మంతు కుటుంబంతో బతుకుదెరువు కోసం బెంగళూరు వెళ్లాడు. గురువారం గ్రామానికి తిరిగి వచ్చిన వారు దూర ప్రాంతం నుంచి వచ్చిన తమకు కరోనా వైరస్ సోకితే గ్రామ ప్రజలకు అది తగిలి ఇబ్బంది కలుగుతుందని స్వచ్ఛందంగా ఉరిబయట తన పొలంలో గుడారం వేసుకుని నివాసం ఉంటున్నారు. విషయం తెలుసుకున్న మక్తల్‌ ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి స్థానిక జడ్పీటీసీని, వైద్యులను పంపి వారికి వైద్యపరీక్షలు చేయించారు. 

ఊరి బయట ఎందుకు ఉంటున్నారని హన్మంతును అడగగా తన కుటుంబం వల్ల గ్రామానికి నష్టం రాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. కూలీ పని చేస్తున్నా తోటి సమాజం గురించి ఆలోచించిన హన్మంతును ఎమ్మెల్యే, డాక్టర్లు అభినందించారు. హన్మంతు కుటుంబానికి కావాల్సిన నిత్యవసర సరుకులను,  ప్రభుత్వం అందజేసిన బియ్యం, నగదును జడ్పీటీసీ వారికి అందజేశారు. లాక్ డౌన్ ఉన్నా ఇండ్లలో ఉండకుండా  బయట తిరుగుతున్న వారు హన్మంతును చూసి నేర్చుకోవాలని సూచించారు. 


logo