శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 15, 2020 , 11:23:11

బ్రహ్మణ పరిషత్‌లో నిత్యావసర సరుకులు పంపిణీ

బ్రహ్మణ పరిషత్‌లో నిత్యావసర సరుకులు పంపిణీ

హైదరాబాద్‌: నగరంలోని బొగ్గుల కుంటలో ఉన్న రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యాలయంలోని బ్రహ్మణ పరిషత్‌లో నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. బ్రాహ్మణులకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి సరుకులు అందజేసి కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమలో ఆర్‌టీఐ కమీషనర్‌ డాక్టర్‌ శంకర్‌నాయక్‌, మైటీ స్పర్ట్స్‌ డైరెక్టర్‌ నందా పాండే, శ్రీ ముదుండి రంగనాథ రాజు ఛారిటుబుల్‌ ట్రస్ట్‌ ఫౌండర్‌ వాసురాజు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడుతూ... లాక్‌డౌన్‌ కారణంగా దేశంలోని అన్ని ఆలయాలు, పూజలు బంద్‌ అయ్యాయని, దాతలు ముందుకు వచ్చి బ్రహ్మణులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. 


logo