మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 04, 2020 , 01:14:58

విద్యుత్‌ ఉద్యోగులకు డీఏ పెంపు

విద్యుత్‌ ఉద్యోగులకు డీఏ పెంపు
  • 4.02 శాతం పెంచుతూ సీఎండీ ఉత్తర్వులు
  • జనవరి 1 నుంచి అమలు
  • 40 వేల మంది ఉద్యోగులు, ఆర్టిజన్లకు లాభం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణలోని విద్యుత్‌ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు, ఆర్టిజన్లకు కరవుభత్యాన్ని 4.02 శాతం పెంచుతూ ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఇప్పటివరకు 8.866 శాతంగా ఉన్న డీఏ 12.886 శాతానికి పెరిగింది. దీనివల్ల టీఎస్‌ ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌లో పనిచేస్తున్న దాదాపు 40 వేలమంది ఉద్యోగులు, కార్మికులు, ఆర్టిజన్లకు లబ్ధిచేకూరనున్నది. ఈ నాలుగు సంస్థల నుంచి రిటైరైన పింఛనుదారులకు కూడా ఇదేస్థాయిలో డీఆర్‌ (డియర్‌నెస్‌ రిలీఫ్‌)ను పెంచుతున్నామని, ఇది ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. ఈ ఉత్తర్వు ప్రకారం విద్యుత్‌ ఉద్యోగులకు మార్చినెల జీతంతోపాటు, పింఛనర్లకు మార్చినెల పింఛన్‌తోతోపాటు డీఏ బకాయిలను చెల్లించనున్నారు.


logo
>>>>>>