గురువారం 21 జనవరి 2021
Telangana - Dec 31, 2020 , 01:54:21

‘సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌' అధ్యక్షుడిగా డీ శ్రీనివాస్‌

‘సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌' అధ్యక్షుడిగా డీ శ్రీనివాస్‌

సుల్తాన్‌బజార్‌: టీఎన్జీవో సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ సెంట్రల్‌ ఫోరం కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా డీ శ్రీనివాస్‌, అసోసియేట్‌ అధ్యక్షుడిగా టీ శివకుమార్‌,ఉపాధ్యక్షులుగా ఎండీ రఫీఖ్‌ అహ్మద్‌, ఆకుల జీవన్‌, వీ శైలజ, కార్యదర్శిగా డీ ప్రశాంత్‌కుమార్‌, సంయుక్త కార్యదర్శులుగా కే కిరణ్‌కుమార్‌, జీ రాము, ఎండీ సఫ్దరుద్దీన్‌, కోశాధికారిగా ఎం జగదీశ్వర్‌, ఆఫీస్‌ కార్యదర్శిగా ఎం వెంకటయ్య, క్రీడా కార్యదర్శిగా ఏ సత్యనారాయణ, కార్యనిర్వహణ కార్యదర్శిగా విశ్వనాథన్‌, ప్రచార కార్యదర్శిగా ఎం మహాసుబుద్దీన్‌ మోయిజ్‌, కార్యవర్గ సభ్యులు ఎస్‌ మధుసూదన్‌రెడ్డి, డీ నాగేశ్వర్‌రావు, వీ వెంకటేశం, అరుణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  ఎన్నికల అధికారిగా టీఎన్జీవో కేంద్ర సంఘం కోశాధికారి రామినేని శ్రీనివాస్‌రావు వ్యవహరించారు. కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌, టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్‌, అసోసియేట్‌ అధ్యక్షురాలు రేచల్‌, ఉపాధ్యక్షురాలు ఉమాదేవి, కార్యదర్శి గరిగబోయిన చంద్రశేఖర్‌(చందు), కార్య నిర్వహణ కార్యదర్శి ఇటిక్యాల కొండల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.logo