గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Sep 01, 2020 , 01:30:40

సైయెంట్‌ చేతికి ఆస్ట్రేలియా సంస్థ

సైయెంట్‌ చేతికి ఆస్ట్రేలియా సంస్థ

హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రస్థానంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ, ఇంజినీరింగ్‌ సేవల సంస్థ సైయెంట్‌..ఆస్ట్రేలియాకు చెందిన కన్సల్టింగ్‌ కంపెనీ అయిన ఐజీ పార్టనర్‌ను కొనుగోలు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియాలో వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి, ప్రాంతీయ రిసోర్ట్‌ విభాగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సైయెంట్‌ ఈ కొనుగోలు జరిపింది. ఒప్పందం విలువ మాత్రం ఇరు సంస్థలు వెల్లడించలేదు. పూర్తిగా నగదు రూపంలో జరుగనున్న ఈ ఒప్పందం కంపెనీ ఎంటర్‌ప్రైజ్‌ విలువ 11.6 మిలియన్‌ ఏయూడీగా ఉన్నది. విదేశీ ఇన్వెస్ట్‌మెంట్‌ రివ్యూ బోర్డు అనుమతిస్తే  ఈ ఒప్పందం వచ్చే ఆరు నెలల్లో పూర్తికాగలదనే విశ్వసాన్ని సైయెంట్‌ వ్యక్తంచేసింది.    


logo