e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home తెలంగాణ అచ్చుగుద్దినట్టు.. అంతా నమ్మేట్టు!

అచ్చుగుద్దినట్టు.. అంతా నమ్మేట్టు!

  • ‘డిటో’మోసాలతో రెచ్చిపోతున్న సైబర్‌ నేరగాళ్లు
  • వ్యక్తిగత సమాచారంతో ఫేక్‌ అకౌంట్ల సృష్టి
  • కొద్దిపాటి చిట్కాలతో ఖాతాలు భద్రం
అచ్చుగుద్దినట్టు.. అంతా నమ్మేట్టు!

హైదరాబాద్‌, జూలై 19 (నమస్తే తెలంగాణ): సైబర్‌ నేరగాళ్లు రోజు రోజుకూ పంథా మారుస్తున్నారు. ‘డిటో’ పేరుతో ఇప్పుడు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. సోషల్‌ మీడియా అకౌంట్లలో సమాచారాన్ని, ప్రొఫైల్‌ ఫొటోలను తస్కరించి మన ఖాతాలను అచ్చుగుద్దినట్టు నకిలీలు తెరుస్తున్నారు. తర్వాత మన కాంటాక్ట్స్‌ లిస్టులో ఉన్నవారికి రిక్వెస్టులు పంపుతున్నారు. వారు అంగీకరించగానే మాయగాళ్లు పని మొదలుపెడుతున్నారు. ‘అత్యవసరంగా డబ్బులు కావాలి. రెండు రోజు ల్లో తిరిగి ఇచ్చేస్తా’ అంటూ మెస్సేజ్‌లు పంపుతారు. అవతలివారు డబ్బులు పంపితే ఆ వెంటనే వాటిని తమ ఖాతాల్లోకి మళ్లించుకుంటున్నారు. అసలు వ్యక్తికి సమాచారం వెళ్లేవరకు ఈ మోసాలు వెలుగులోకి రావడంలేదు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్టు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.

ఇలాచేస్తే మేలు..

  • సోషల్‌ మీడియా అకౌంట్లలో ప్రైవసీ సెట్టింగ్స్‌ ఎనేబుల్‌ చేసుకుంటే మన ఫ్రెండ్స్‌ లిస్ట్‌ కొత్తవారికి కనిపించదు.
  • ప్రొఫైల్‌ పిక్చర్‌ను ప్రొటెక్ట్‌ సెట్టింగ్స్‌లో పెట్టుకుంటే ఇతరులు కాపీ చేసేందుకు వీలుండదు.
  • స్నేహితులెవరి నుంచైనా ఫ్రెండ్‌ రిక్వెస్టులు వస్తే వారితో సంప్రదించిన తర్వాతే అంగీకరించాలి.
  • ఒకవేళ ఆ తరహాలో నకిలీ ఖాతాలున్నట్టు గుర్తిస్తే వెంటనే సదరు సోషల్‌ మీడియా సంస్థలకు సమాచారం ఇవ్వాలి.
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అచ్చుగుద్దినట్టు.. అంతా నమ్మేట్టు!
అచ్చుగుద్దినట్టు.. అంతా నమ్మేట్టు!
అచ్చుగుద్దినట్టు.. అంతా నమ్మేట్టు!

ట్రెండింగ్‌

Advertisement