సోమవారం 18 జనవరి 2021
Telangana - Dec 22, 2020 , 02:30:34

గుర్‌గావ్‌లో రింగ్‌మాస్టర్స్‌హైదరాబాద్‌లో వసూల్‌ రాజాలు

గుర్‌గావ్‌లో రింగ్‌మాస్టర్స్‌హైదరాబాద్‌లో వసూల్‌ రాజాలు

  • లోన్‌ యాప్స్‌కు చైనా సాంకేతిక దన్ను.. 
  • 1200 మందితో కాల్‌సెంటర్ల నిర్వహణ
  • నగరాల్లో సైబర్‌క్రైం పోలీసుల దాడులు

హైదరాబాద్‌ సిటీ బ్యూరో, నమస్తే తెలంగాణ: లోన్‌యాప్స్‌ నిర్వాహకులపై సైబర్‌ క్రైం పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన 25 ఫిర్యాదులపై దర్యాప్తు ప్రారంభించారు. గుర్‌గావ్‌లో వీటి ప్రధాన అడ్డాలు ఉన్నట్టు తేల్చారు. వాటి అనుబంధ సంస్థలు హైదరాబాద్‌లో కొనసాగుతున్నాయని గుర్తించారు. గుర్‌గావ్‌ వెళ్లిన సైబర్‌ క్రైం పోలీసులు అక్కడ10 కాల్‌సెంటర్లపై దాడులు నిర్వహించి 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ట్రాన్సిట్‌ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చి విచారణ జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నది. గుర్‌గావ్‌లో అదుపులోకి తీసుకున్న వారిని విచారించడంతో హైదరాబాద్‌లోని కాల్‌ సెంటర్ల గుట్టరట్టయ్యింది. గుర్‌గావ్‌లోని కాల్‌సెంటర్లలో 700 మంది వరకు పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. గుర్‌గావ్‌లోని లోన్‌యాప్స్‌కు అనుబంధం గా నిర్వహిస్తున్న కాల్‌సెంటర్లపై సోమవా రం పోలీసులు దాడి చేశారు. పంజాగుట్ట, బేగంపేట్‌లో మూడు కేంద్రాల్లో ఇన్‌ప్రింట్‌ టెక్నాలజీస్‌ పేరిట సంస్థను ఏర్పాటు చేసి లో న్‌ యాప్‌ దందా నిర్వహిస్తున్నట్టు గుర్తించి దాడు లు చేశారు. ఈ మూడు సంస్థల్లో దాదా పు 500 మంది ఉద్యోగులు పని చేస్తున్నట్టు తే ల్చారు. వీరందరీకి ప్రతి నెలా రూ. 10 వేల జీతంతోపాటు సకాలంలో లోన్‌రికవరీ చేస్తే మరో 10 వేల నుంచి 20 వేల వరకు ఇన్సెంటివ్‌ ఇస్తున్నట్టు తేలింది. ఈ సంస్థల మేనేజర్‌లను పోలీసులువిచారిస్తున్నారు 

చైనీయుల సాంకేతిక సహకారం

లోన్‌యాప్స్‌ నిర్వాహకులకు  ఇండోనేషి యా, మలేషియాలో ఉంటున్న చైనీయులే సాంకేతిక పరిజ్ఞానం, యాప్‌ల తయారీల్లో సంపూర్ణంగా సహకరిస్తున్నారని తెలిసింది. 

గుర్గావ్‌ సమాచారంతో దాడులు


లోన్‌ యాప్స్‌ కేసుల దర్యాప్తు ముమ్మరం చేశాం. వారి మూలాలు గుర్గావ్‌లో ఉన్నాయని తెలిసి అక్కడికి ప్రత్యేక బృందాలు వెళ్లాయి. దర్యాప్తులో హైదరాబాద్‌కు సంబంధించిన లింకులున్నట్టు తేలడంతో ఇక్కడి కాల్‌సెంటర్లపై దాడులు చేశాం. 16 యాప్‌ల వ్యవహారాలు వీటి ద్వారా నడుస్తున్నట్టు గుర్తించాం. కాల్‌సెంటర్‌ ఉద్యోగులు  మూడు దశల్లో వేధింపులకు గురిచేస్తున్నారు.  కాల్‌సెంటర్లలోని కంప్యూటర్ల హార్డ్‌ డిస్క్‌లు, నిర్వాహకుల సెల్‌ ఫోన్లు విశ్లేషిస్తే మరింత సమాచారం వస్తుంది.           

- అవినాష్‌ మహంతి, జాయింట్‌ సీపీ, సీసీఎస్‌