శనివారం 06 జూన్ 2020
Telangana - May 15, 2020 , 16:58:52

రాత్రి 7 తర్వాత రోడ్డెక్కితే బండి సీజ్‌

రాత్రి 7 తర్వాత రోడ్డెక్కితే బండి సీజ్‌

హైదరాబాద్‌: ప్రజలు లాక్‌డౌన్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జన్నార్‌ సూచించారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. సాయంత్రం 7 గంటల తర్వాత ఎవ్వరూ రోడ్డుపై కనిపించకూడాదని, ఏవైనా వాహనాలు రోడ్డుపై తిరిగినట్లయితే వాటిని సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని అందువల్ల సాయంత్రం ఆరు గంటల వరకు అన్ని షాపులు, ఆఫీసులు, బ్యాంకులు మూసివేయాలని సైబరాబాద్‌ పోలీసులు ప్రకటించారు. ప్రజలు మార్నింగ్‌వాక్‌, ఈవినింగ్‌ వాక్‌లు చేయకూడదని సూచించారు. చిన్న సాకులు చూపుతూ ప్రజలు బయట తిరగకూడదని సూచించారు. ఇప్పటివరకు లాక్‌డౌన్‌ నిబంధనలను అతిక్రమించిన సుమారు 9 లక్షల మందిపై కేసులు చేశామని, 20,591 వాహనాలను సీజ్‌ చేశామని చెప్పారు. అందులో 16 వేల ద్విచక్రవాహనాలు, 1401 త్రిచక్రవాహనాలు, 2246 భారీ వాహనాలు, 144 ఇతర వాహనాలు ఉన్నాయన్నారు.


logo