మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 08, 2020 , 01:10:21

నగ్న ఫొటోలు పంపాలని బ్లాక్‌మెయిల్

నగ్న ఫొటోలు పంపాలని బ్లాక్‌మెయిల్

  • సోదరి ఫోటోలను పంపిన అక్క 
  • బ్లాక్‌మెయిలర్‌ అరెస్టు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఇన్‌స్టాగ్రాంలో మార్ఫింగ్‌ ఫోటోలు పెడతానంటే భయపడిన యువతి బ్లాక్‌మెయిలర్‌కు సోదరి బట్టలు మార్చుకుంటుండగా ఫొటోలు తీసి పంపింది. అయినా వేధింపులు మితిమీరడంతో కుటుంబ సభ్యులతో కలిసి రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తు చేసిన పోలీసులు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డ యువకుడిని మంగళవారం అరెస్టు చేశారు. రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...హైదరాబాద్‌ బహదూర్‌పురా హౌజింగ్‌ బోర్డు కాలనీకి చెందిన శుభమ్‌యాదవ్‌ ఇంటర్మీడియట్‌ వరకు చదివి ప్రస్తుతం పాన్‌షాపులో పని చేస్తున్నాడు. చదువుకొనే సమయంలో ఓ యువతితో సన్నిహితంగా తిరిగేవాడు. ఆ సందర్భంలో తీసుకున్న ఆమె ఫోటోలు దాచిపెట్టుకున్నాడు. తాజాగా ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రాంలో నకిలీ ఐడీ ద్వారా యువతికి పంపి తనకు నగ్న ఫోటోలను పంపాలని బెదిరించాడు. లేదంటే మార్ఫింగ్‌చేసి వాటిని సోషల్‌ మీడియాలో పెడుతానని వేధించాడు. దీనికి భయపడ్డ యువతి తన సోదరి బట్టలు మార్చుకుంటుండగా ఫొటోలు తీసి అతనికి పంపింది. దాన్ని అవకాశంగా చేసుకుని శుభమ్‌ యాదవ్‌ మరింత వేధించాడు. దీంతో విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు మంగళవారం శుభమ్‌యాదవ్‌ను అరెస్టు చేశారు. 


logo