బుధవారం 27 మే 2020
Telangana - May 21, 2020 , 20:05:53

ఓఎల్‌ఎక్స్‌లో మోసం.. రూ.50వేలు గోవిందా!

 ఓఎల్‌ఎక్స్‌లో మోసం.. రూ.50వేలు గోవిందా!

 వ్యాయమానికి  సంబంధించిన కుర్చీని  ఓఎల్‌ఎక్స్‌లో అమ్మాకానికి పెట్టి ఓ వైద్య విద్యార్థి రూ.50 వేలు పొగొట్టుకున్నాడు. ఓఎల్‌ఎక్స్‌లో పెట్టిన ప్రకటనకు ఆర్మీ అధికారినంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి  విద్యార్థికి ఫోన్‌ చేశాడు. తాను ఆ కుర్చీని కొంటానని,  రూ.15 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. అయితే తమ ఆర్మీ నిబంధనల ప్రకారం మొదట మీరు 15వేల రుపాయాలు డిపాజిట్‌ చేస్తే మీకు తిరిగి 15వేలకు మరో పదిహేనువేలు  కలిపి మొత్తం రూ.30వేలు మీ అకౌంట్లో జమ అవుతాయని నమ్మించాడు.

ఇది ఏలా సాధ్యమని  విద్యార్థి ప్రశ్నించగా మీరు నాకు 5 రుపాయాలు పంపండి మీకు 10 రుపాయాలు వస్తాయని చెప్పాడు. దీంతో విద్యార్థి గూగుల్‌ పే ద్వారా 5 రుపాయాలు పంపిస్తే అతను తిరిగి 10 రుపాయాలు పంపాడు. నిజమే అనుకుని వైద్య విద్యార్థి 15 వేల రుపాయాలు పంపాడు. తిరిగి 30 వేల రుపాయాలు రాకపోవడంతో ఫోన్‌ చేయగా సాంకేతిక కారణంతో రాలేదు. మరో 10 వేలు వేయండి మొత్తం 40 వేల రుపాయాలు వస్తాయని నమ్మించాడు. అలా బాధితుడి నుంచి మొత్తం 50 వేలు వసూలు చేసి సైబర్‌ మాయగాడు మస్కా కొట్టాడు. బాధితుడు సీటీ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


logo