మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 24, 2020 , 08:53:15

లాటరీ పేరుతో డబ్బులు కాజేసిన సైబర్‌ చీటర్‌ అరెస్ట్‌

లాటరీ పేరుతో డబ్బులు కాజేసిన సైబర్‌ చీటర్‌ అరెస్ట్‌

హైదరాబాద్ : రూ. 12.60 లక్షల విలువైనా కారు లక్కీడ్రాలో గెలుచుకున్నారని నమ్మించి.. రూ.1.18 లక్షలు కొట్టేసిన బీహార్‌కు చెందిన సైబర్‌చీటర్‌ను సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మాసబ్‌ట్యాంక్‌కు చెందిన విక్రమ్‌ స్నాప్‌డీల్‌లో వాచ్‌ కొన్నాడు. మరుసటి రోజే  స్నాప్‌డీల్‌ నుంచి మాట్లాడుతున్నామంటూ...మీరు కారును గిఫ్ట్‌గా గెలుచుకున్నారంటూ.. కారు  కావాలంటే రిజిస్ట్రేషన్‌ తదితర చార్జీలు చెల్లించాలంటూ .. దఫ దఫాలుగా 1.18 లక్షలు కాజేశారు. బాధితుడి ఫి ర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్‌ వెంకట్రామిరెడ్డి బృందం బీహార్‌ ఖహగార్యకు వెళ్లి.. నిందితుడు సురేశ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని నగరానికి తరలించారు. ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు.


logo
>>>>>>