శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 30, 2020 , 01:51:14

చెట్లు నరికించి..మొక్కలు నాటారు!

చెట్లు నరికించి..మొక్కలు నాటారు!

  • పోలీస్‌ అకాడమీ పాత డైరెక్టర్‌ వింత నిర్ణయాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ స్థానం నుంచి ఇటీవల బదిలీ అయిన వీకేసింగ్‌ వింత చేష్టలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. పచ్చదనం పెంచేందుకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఇదే అదనుగా మాజీ డైరెక్టర్‌ అకాడమీలో ఉన్న వందలాది చెట్లను నరికించారన్న ఆరోపణలున్నాయి. నరికించిన చెట్ల స్థానంలో మామిడి మొక్కలు నాటి అకాడమీకి ఆదాయం తేవాలన్నది పాత డైరెక్టర్‌ ఆలోచన అని పలువురు అంటున్నారు. హరితహారం అంటే కొత్త మొక్కలను పెంచాలి కానీ, ఉన్న చెట్లను నరికించడం ఏమిటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  logo