సోమవారం 08 మార్చి 2021
Telangana - Jan 27, 2021 , 21:23:07

కస్టమ్స్‌ సేవలు ప్రశంసనీయం : గవర్నర్ తమిళిసై

కస్టమ్స్‌ సేవలు ప్రశంసనీయం : గవర్నర్ తమిళిసై

హైదరాబాద్ ‌: కస్టమ్స్‌ విధులు నిర్వర్తించడం చాలా కష్టంతో కూడుకున్న పని అని గవర్నర్‌ తమిళిసై అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని నాంపల్లిలో జరిగిన అంతర్జాతీయ కస్టమ్‌ దినోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కరోనా సమయంలో కస్టమ్స్‌ అధికారులు నిర్వహించిన విధులు ప్రశంసనీయమన్నారు. ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు వెన్నెముకలా పని చేశారని అభినందించారు.

ఇదే స్ఫూర్తిని భవిష్యత్తు లోనూ కొనసాగించాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్‌ ఫార్మా రంగానికి రాజధాని. 150 దేశాలకు హైడ్రో క్లోరోక్విన్‌ను మన దేశం నుంచి ఎగుమతి చేయడం గర్వకారణమన్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ మన దేశంలో తయారవుతోంది. ఇక్కడ ఇవ్వడంతో పాటు అభివృద్ధి చెందిన దేశాలకు టీకా సరఫరా చేస్తున్నాం.

భారత్‌ సేవల్ని డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసించిందని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ను రూపొందించడమే కాకుండా ఇతర దేశాలకూ ఇస్తున్నాం. ఇది దేశానికి గర్వకారణమైన విషయం. ఇందులో భాగస్వాములమైన కస్టమ్స్‌ అధికారుల్ని అభినందిస్తున్నా అని గవర్నర్‌ అన్నారు. 

ఇవి కూడా చదవండి..

సమస్యల పరిష్కారానికే ‘ప్రజా వేదిక’

13 సార్లు జైలుకు వెళ్లొచ్చినా తీరు మారలేదు

సీఎం కేసీఆర్ గొప్ప లౌకికవాది : మంత్రులు 

అనర్హులకు ఇండ్లు కేటాయిస్తే కఠిన చర్యలు : స్పీకర్‌ పోచారం 

తెలంగాణ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం 

ఉనికి కోసమే ఉత్తమ్ పాకులాట : ఎమ్మెల్యే శానంపూడి 

VIDEOS

logo