బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 05, 2020 , 01:46:52

పట్టుబడ్డ బంగారంపై కస్టమ్స్‌ ఆరా

పట్టుబడ్డ బంగారంపై కస్టమ్స్‌ ఆరా

శంషాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో శనివారం పెద్దమొత్తంలో పట్టుబడ్డ బంగారంపై కస్టమ్స్‌ అధికారులు ఆరాతీస్తున్నారు. కొరియర్ల ద్వారా అక్రమంగా పార్సిల్‌ చేస్తున్న విషయంపై దృష్టిసారించారు. ఈ బంగారాన్ని హైదరాబాద్‌కు చెందిన శ్రీపాల్‌జైన్‌ అనే వ్యక్తి ముంబైలో ఉండే అశోక్‌ అనే వ్యక్తికి పార్సిల్‌ ద్వారా పంపుతున్నట్టు అడ్రస్‌ ఉండటంతో స్మగ్లింగ్‌ వ్యవహారం తేల్చేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.


logo