శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 02, 2020 , 00:34:33

ఉద్యోగులకు శాపం సీపీఎస్‌

ఉద్యోగులకు శాపం సీపీఎస్‌
  • కేంద్రంపై టీఈఏ, ఎన్వోపీఆర్‌యూఎఫ్‌ మండిపాటు
  • పాత పెన్షన్‌ విధానం సాధనకు ఒకరోజు దీక్ష

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) కొత్త ఉద్యోగులకు శాపమని ప్రభుత్వ ఉద్యోగులు అన్నారు. పాత పెన్షన్‌ విధానం సాధనకు తెలంగాణ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (టీఈఏ), నేషనల్‌ ఓల్డ్‌ పెన్షన్‌ రిస్టోరేషన్‌ యునైటెడ్‌ ఫ్రంట్‌ (ఎన్వోపీఆర్‌యూఎఫ్‌) ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు వద్ద ఒకరోజు నిరాహార దీక్షకు దిగారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. టీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు సంపత్‌కుమారస్వామి, ఎన్వోపీఆర్‌యూఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు బీపీసింగ్‌తదితరులు పాల్గొన్నారు.


 సీపీఎస్‌ రద్దుకు ఐక్యవేదిక డిమాండ్‌ 

హిమాయత్‌నగర్‌: సీపీఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్‌ సెక్టార్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం హిమాయత్‌నగర్‌లోని బీసీభవన్‌లో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. 


logo