గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Aug 13, 2020 , 17:21:08

రాష్ట్రంలో సంబురంగా సాగు పనులు : మంత్రి నిరంజన్ రెడ్డి

రాష్ట్రంలో సంబురంగా సాగు పనులు : మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి : సీఎం కేసీఆర్ చొరవతో ప్రాజెక్ట్ లకు మహర్దశ పట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గం మదనపురం మండలంలోని సరళ సాగర్ ప్రాజెక్టు కట్ట గత ఏడాది డిసెంబర్ 31న తెగిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో అతి తక్కువ కాలంలో నే యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తయ్యాయని తెలిపారు. సరళా సాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు  రెండు పంటలకు నీరు ఇస్తామని మంత్రి తెలిపారు.

 రైతులకు సాగునీరు అందించాలని సీఎం కేసీఆర్ నిరంతరం తపన పడతారని పేర్కొన్నారు. కట్ట తెగిపోతే ముఖ్యమంత్రి మాకు ధైర్యం చెప్పారు. రాష్ట్రంలో సాగు సంబురంగా కొనసాగుతున్నదని చెప్పారు. తెలంగాణలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. ఈ రోజు వరకు కోటి ఇరవై లక్షలకు ఎకరాలకు పైగా  సాగు అయిందని వివరాలు వెల్లడించారు. 


ఇంకో పదిలక్షలకు పైగా ఎకరాలు సాగు అయ్యే అవకాశం ఉంది. నియంత్రిత సాగు విజయవంతంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. రైతులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం  ప్రాజెక్ట్ కు మంత్రి జల పూజ చేశారు. కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, తదితరులు పాల్గొన్నారు.logo