శనివారం 04 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 14:47:59

ఇగురంతో సాగు..లాభాలు బాగు

ఇగురంతో సాగు..లాభాలు బాగు

యాదాద్రి భువనగిరి : నియంత్రిత సాగుతోటే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగమే లాభదాయక పంటలపై రైతాంగం దృష్టి సారించేలా నియంత్రిత సాగుపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. భువనగిరిలో నిర్వహించిన నియంత్రిత సాగు ససదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలన్నదే అవగాహన సదస్సుల లక్ష్యం అన్నారు. ఇందులో రైతులను భాగస్వామ్యం చేసేందుకు ప్రతి ఒక్కరు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

డిమాండ్ ఉన్న పంటలపై రైతులు దృష్టి సారించినప్పుడు మాత్రమే మనం పండించిన పంటకు మనం ధర నిర్ణయించుకునే శక్తి వస్తుందన్నారు. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ఉండేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత్రిత సాగుపై సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రైతులను ఆర్థికంగా పరిపుష్టం చేయాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని, అందుకు అనుగుణంగా రైతులు కలసి వస్తే భవిష్యత్ మొత్తం వ్యవసాయ రంగానిదే అవుతుందన్నారు.


 


logo