బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Sep 23, 2020 , 11:24:01

‘ధరణి’పై కలెక్టర్లతో సీఎస్‌ సమీక్ష

‘ధరణి’పై కలెక్టర్లతో సీఎస్‌ సమీక్ష

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు బుధవారం ఉదయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహిస్తున్న సమావేశంలో ధరణి పోర్టల్‌తో పాటు వ్యవసాయేతర భూముల వివరాలను ఆన్‌లైన్‌లో చేర్చే ప్రక్రియ, రిజిస్ట్రేషన్ల సన్నాహకాలు, రిజిస్ట్రేషన్లు చేయడానికి అదనంగా తహసీల్దార్‌ కార్యాలయానికి ఏయే మౌలిక సదుపాయాలు అవసరం వంటివాటిపై జిల్లాల వారీగా ఆరా తీయడంతోపాటు తగిన ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక వ్యవసాయేతర భూములు, ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో చేర్చి, డేటాను నవీకరించడానికి అదనపు కలెక్టర్లను నోడల్‌ అధికారులుగా నియమించనున్నారు.

అలాగే రైతు వేదికల నిర్మాణం, ఎల్‌ఆర్‌ఎస్‌, వీధివ్యాపారులు, వైకుంఠధామాల నిర్మాణం, కస్టమ్స్‌ మిల్లింగ్‌పై సమీక్షించనున్నారు. సీఎం కేసీఆర్‌ కొత్త రెవెన్యూచట్టం అమలులో భాగంగా తీసుకురానున్న ‘ధరణి’ పోర్టల్‌ రూపకల్పనపై మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆస్తుల ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారులు (డీపీవో) మండల పంచాయతీ అధికారుల (ఎంపీడీవో)తో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు సీఎస్‌ అధికారులతో సమీక్ష సమీక్ష నిర్వహిస్తున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo