మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Oct 17, 2020 , 13:16:07

'ధ‌ర‌ణి'పై జిల్లాల అధికారుల‌తో సీఎస్ వీడియో కాన్ఫ‌రెన్స్‌

'ధ‌ర‌ణి'పై జిల్లాల అధికారుల‌తో సీఎస్ వీడియో కాన్ఫ‌రెన్స్‌

హైద‌రాబాద్‌: ద‌స‌రా నుంచి ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్రారంభం కానుండ‌టంతో ప్ర‌భుత్వం అధికారుల‌ను సిద్ధం చేస్తున్న‌ది. ఇందులో భాగంగా ధ‌ర‌ణి పోర్ట‌ల్ నిర్వ‌హ‌ణ‌, స‌న్న‌ద్ధ‌త‌పై సీఎస్ సోమేశ్ కుమార్ అన్ని జిల్లాల అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మీక్ష  నిర్వ‌హిస్తున్నారు. ఈ స‌మీక్షా స‌మావేశానికి క‌లెక్ట‌ర్లు, అద‌న‌పు క‌లెక్ట‌ర్లు, త‌హ‌సీల్దార్లు హాజ‌య‌ర్యారు. రాష్ట్రంలోని భూముల వివ‌రాల‌న్నీ ద‌స‌రా నుంచి ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లోనే న‌మోదు చేయ‌నున్నారు. దీనికోసం పోర్ట‌ల్‌ను ప్ర‌భుత్వం ఇప్ప‌టికే సిద్ధంచేసింది. 

దేశంలోని మొద‌టిసారిగా తెలంగాణ ప్ర‌భుత్వం రెవెన్యూ సంస్క‌ర‌ణ‌ల‌ను చేప‌ట్టింది. ఇందులో భాగంగా కోర్‌ బ్యాంకింగ్‌ తరహాలో భూమి లావాదేవీలు నిర్వహించే ప్రక్రియకు సీఎం కేసీఆర్‌ సర్కారు శ్రీకారంచుట్టింది. ఇందులో కీలకమైన ‘ధరణి’ పోర్టల్‌ను ఇప్ప‌టికే రూపొందించింది. భూ రికార్డుల నిర్వ‌హ‌ణ పూర్తి పార‌ద‌ర్శ‌కంగా జ‌రిగేలా పోర్ట‌ల్‌ను త‌యారుచేశారు. దీనివ‌ల్ల భూస‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం ల‌భించ‌నుంది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo