బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 16, 2020 , 22:07:42

కరోనా వైరస్ జాగ్రత్తలపై సీఎస్ వీడియో కాన్షరెన్స్...

కరోనా వైరస్ జాగ్రత్తలపై సీఎస్ వీడియో కాన్షరెన్స్...

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరెస్ వ్యాప్తి చెందుతున్న సందర్భంగా వైరెస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఇచ్చిన ఆదేశాలను తప్పకుండా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్  జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మార్చి 14 తేదిన ఇచ్చిన జి.ఒ. 4 ను ఖచ్చితంగా అమలు చేయాలని అన్నారు.సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి కరోనా వైరెస్ నియంత్రణకు సంసిద్దత పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను మానిటర్ చేయడానికి జిల్లా స్థాయిలో ఇంటర్ డిసిప్లీనరీ టీమ్ ఏర్పాటు చేయాలని సీఎస్ ఆదేశించారు. చైనా, సౌత్ కోరియా, ఇరాన్, ఇటలీ, స్పేయిన్, జర్మనీ, ఫ్రాన్స్, దేశాల నుండి ప్రయాణికులను క్వారంటైన్ చేయాలని నియమాలను పాటించాలని సూచించారు.

విదేశాల నుంచి వచ్చిన వారిని కాంటాక్ట్ అయిన వారి వివరాలను ట్రాక్ చేయాలన్నారు. ప్రోఫెషనల్ పద్దతిలో పరిస్థితులను స్మూత్ గా డీల్ చేయాలన్నారు.  విద్యా సంస్థలు , కోచింగ్ సంస్థలు వెంటనే మూసివేసేలా అవి మార్చి 31 తేది వరకు మూసివుండెలా కూడా చూడాలని ఆదేశించారు. బోర్డు పరీక్షలు యదా విదిగా జరుగుతయన్నారు. సమావేశాలు, జనం సమూహలుగా గుమిగూడడం, కార్యక్రమాలు జిల్లాలలో జరగకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. తప్పుడు వార్తలు వ్యాప్తి చేసినవారి పై కఠిన చర్యలు తీసుకొబడుతాయని అన్నారు.కలెక్టర్లు ఎన్ఆర్ఈజీఎస్ పనులను కోనసాగించ వచ్చన్నారు.ప్రజలలో వ్యక్తిగత శుభ్రతపై మరియు జర్వం, ఇన్ ప్లుయెంజా తో బాదపడుతున్న వారికి దూరంగా ఉండడం పట్ల జిల్లా కలెక్టర్లు అవగాహన కల్పించాలని కోరారు.పబ్లిక్ మరియు ప్రైవేట్ ట్రాన్స్ పోర్టులో పరిశుభ్రత మరియు స్వచ్ఛత ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.

మాహారాష్ట్రలో ఎక్కువగా కరోనా వైరెస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నందున సరిహద్దు జిల్లా కలెక్టర్లు ఎక్కువ అప్రమత్తత తో ఉండాలన్నారు.ఈ సమావేశంలో  వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యకార్యదర్శులు సునీల్ శర్మ, వికాస్ రాజ్ , జగదీశ్వర్, కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, సుదర్శన్ రెడ్డి, ఒమర్ జలీల్ , టి.కె. శ్రీదేవి, కుటుంబ సంక్షేమం మరియు ఆరోగ్య శాఖ కమీషనర్ యోగిత రాణా, పరిశ్రమల శాఖ కమీషనర్ మానిక్ రాజ్, జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేశ్ కుమార్ , గ్రామీణాభివృద్ధి , పంచాయతీ రాజ్ కమీషనర్ రఘునందన్ రావు, పోలీస్ శాఖ ఆదనపు డి.జి. జితేందర్ తదితరులు పాల్గొన్నారు.


logo