శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 25, 2020 , 14:19:14

వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌లు.. అధికారుల‌కు సీఎస్ అభినంద‌న‌

వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌లు.. అధికారుల‌కు సీఎస్ అభినంద‌న‌

హైద‌రాబాద్ : వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొన్న వారంద‌రికీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలిపారు. న‌గ‌రంలో వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌లు పూర్త‌య్యేందుకు కీల‌క పాత్ర పోషించిన మున్సిప‌ల్ శాఖ కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్‌, జీహెచ్ఎంసీ క‌మిష‌నర్ లోకేశ్ కుమార్, సీడీఎంఏ స‌త్య‌నారాయ‌ణ‌, క‌లెక్ట‌ర్ శ్వేతా మ‌హంతి, ఇత‌ర అధికారుల‌ను సీఎస్ సోమేశ్ కుమార్ అభినందించారు. ప్ర‌జా సంక్షేమం కోరే వారికి అమ్మ‌వారి దీవెన‌లు ఎల్ల‌ప్పుడూ ఉంటాయ‌ని సీఎస్ పేర్కొన్నారు. వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల్లో భాగంగా 80 వేల కుటుంబాల‌కు అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు ఆర్థిక సాయం అందించారు. ఒక్కో ఇంటికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించామ‌ని తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 120 కోట్ల మేర ఆర్థిక సాయం చేసిన‌ట్లు తెలిపారు. ఈ విజ‌య‌ద‌శ‌మి వేళ రాష్ర్ట ప్ర‌జ‌ల‌కు అంతా శుభ‌మే జ‌ర‌గాల‌ని సీఎస్ సోమేశ్ కుమార్‌ ఆకాంక్షించారు.