బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 18:06:25

ఉపాధి హామీ క్యాలెండర్‌ రూపొందించండి: సీఎస్‌

ఉపాధి హామీ క్యాలెండర్‌ రూపొందించండి: సీఎస్‌

హైదరాబాద్‌: ఉపాధి హామీ ద్వారా రాష్ట్రంలోని యువతకు ఉపాధి లభించేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉపాధి పనుల అనుసంధానంపై ఆయన సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల్లో అభివృద్ధి పనులు, ఉపాధి నిధుల అనుసంధానానికి ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. శాఖల్లో పనులను గుర్తించి ఉపాధిహామీ ద్వారా చేసేందుకు క్యాలెండర్‌ రూపొందించాలని సూచించారు. 

గ్రామీణ ప్రాంతాలు అధిక నిధులు పొందేలా చూడాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు ఆదేశించారని వెల్లడించారు. వైకుంఠధామాలు, డంప్‌ యార్డుల పనులు చేపట్టడం, రైతు వేదికలు, గ్రామీణ పార్కుల పనులపై దృష్టిసారించాలన్నారు. గొర్రెల షెడ్ల నిర్మాణాలు, ఫీడర్‌ చానళ్ల పనులపై త్వరతగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. ఉపాధిహామీ పనుల్లో వివిధ శాఖలు క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు.


logo