శనివారం 28 నవంబర్ 2020
Telangana - Oct 27, 2020 , 14:50:16

పార‌ద‌ర్శ‌కంగా ధ‌ర‌ణి రూప‌క‌ల్ప‌న : సీఎస్ సోమేశ్ కుమార్‌

పార‌ద‌ర్శ‌కంగా ధ‌ర‌ణి రూప‌క‌ల్ప‌న : సీఎస్ సోమేశ్ కుమార్‌

మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి : ‘ధరణి’ పోర్ట‌ల్‌పై తాసిల్దార్లకు, న‌యాబ్ తాసిల్దార్ల‌కు అనురాగ్ యూనివ‌ర్సిటీలో నిర్వ‌హించిన శిక్ష‌ణా కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌తో పాటు ఇత‌ర ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ నెల 29న ముఖ్య‌మంత్రి కేసీఆర్ ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్రారంభిస్తార‌ని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచ‌న‌ల మేర‌కు ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను పార‌ద‌ర్శ‌కంగా రూప‌క‌ల్ప‌న చేశామ‌ని స్ప‌ష్టం చేశారు. తాసిల్దార్ సెల‌వులో ఉంటే న‌యాబ్ తాసిల్దార్ ప‌ని చేయాల‌ని ఆదేశించారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ అందుబాటులోకి వ‌స్తే రిజిస్ర్టేష‌న్‌, మ్యుటేష‌న్ వెంట‌నే జ‌రిగిపోతాయ‌న్నారు. ఎవ‌రి పేరుపై భూమి ఉంటుందో వారి ఆధార్ నంబ‌ర్‌ను ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో న‌మోదు చేస్తారు. మోసం చేయ‌డానికి ఎలాంటి ఆస్కారం లేద‌ని ఆయ‌న‌ స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వ భూమి, వ‌క్ఫ్, దేవాల‌య భూముల‌ను ఆటోలాక్‌లో పెట్టామ‌ని సీఎస్ తెలిపారు. 

ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్రారంభానికి రంగారెడ్డి జిల్లా వేదిక కానుంది. ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్ ను ప్రారంభించ‌నున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.