గురువారం 09 ఏప్రిల్ 2020
Telangana - Mar 17, 2020 , 16:42:25

వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సీఎస్‌ భేటీ

వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సీఎస్‌ భేటీ

కరోనా వ్యాప్తి దృష్ట్యా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సీఎస్‌ నిర్వహించిన సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బోధన, స్పెషాలిటీ ఆస్పత్రుల్లో నిర్ణీత శస్త్రచికిత్సలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు నిర్ణీత శస్త్రచికిత్సలు నిలిపివేతకు నిర్ణయించారు. అత్యవసర శస్త్రచికిత్సలు, ఓపీ, వైద్య సేవలు యథావిధిగా కొనసాగించాలని ఆదేశించారు. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోని ఆస్పత్రులకు వర్తిస్తుందని తెలిపారు. 


logo