ఆదివారం 17 జనవరి 2021
Telangana - Nov 28, 2020 , 01:23:15

మత్స్యశాఖకు సీఎస్‌ అభినందన

మత్స్యశాఖకు సీఎస్‌ అభినందన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సముద్ర తీర ప్రాంతంలేని (ఇన్‌లాండ్‌) క్యాటగిరీలో తెలంగాణ స్టేట్‌ ఫిషర్‌మెన్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ ఫెడరేషన్‌.. కేంద్రం నుంచి ప్రథమ బహుమతి అందుకోవడంపై మత్స్యశాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అభినందించారు. ఈ నెల 21న ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా పురస్కారం రాగా, పశు సంవర్ధకశాఖ కార్యదర్శి అనితారాజేంద్ర శుక్రవారం బీఆర్కేభవన్‌లో సీఎస్‌ను కలిశారు. కాళేశ్వరం వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టు, చెరువుల్లో పెరిగిన నీటి లభ్యత వల్ల ఇన్‌లాండ్‌ ఫిషరీస్‌కు అవకాశాలున్నాయని సోమేశ్‌కుమార్‌ తెలిపారు. మత్స్యశాఖ అధికారులు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని సూచించారు.