గురువారం 04 జూన్ 2020
Telangana - May 02, 2020 , 21:27:13

క్రెడాయ్‌, ట్రెడాయ్‌ ప్రతినిధులతో సీఎస్‌ టెలికాన్ఫరెన్స్‌

క్రెడాయ్‌, ట్రెడాయ్‌ ప్రతినిధులతో సీఎస్‌ టెలికాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌: క్రెడాయ్‌, ట్రెడాయ్‌ ప్రతినిధులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ...పట్టణాల్లో నిర్మాణరంగ పనులకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ప్రాజెక్టు డెవలపర్లు, కార్మికులకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలి. నిర్మాణరంగానికి ప్రభుత్వం తరపున పూర్తి సహాకారం ఉంటుంది. ప్రాజెక్టు డెవలపర్లు వలసకార్మికుల్లో విశ్వాసం కలిగించాలి. వలసకూలీలకు ప్రోత్సాహకాలు, సౌకర్యాలు, వైద్యవసతి కల్పించాలని తెలిపారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ... నిర్మాణరంగ సామాగ్రి తీసుకువెళ్లే వాహనాలకు ఇబ్బంది కలుగకుండాచూస్తామని వెల్లడించారు. 


logo