మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 04, 2020 , 13:16:18

యాదాద్రిలో భక్తుల రద్దీ.. లఘు దర్శనానికి అనుమతి

యాదాద్రిలో భక్తుల రద్దీ.. లఘు దర్శనానికి అనుమతి

యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తుల తాకిడి పెరిగింది. కరోనా నేపథ్యంలో భక్తులకు థర్మల్‌ స్క్రీనింగ్‌, శానిటైజేషన్‌ అనంతరమే క్యూలైన్‌లోకి అనుమతిస్తున్నారు. లఘు దర్శనానికి మాత్రమే భక్తులను ఆలయ అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. వాహనాలను కొండపైకి పోలీసులు అనుమతించడం లేదు. ఇదిలాఉండగా యాదాద్రి ఆలయంలో ఆర్జిత సేవ‌లు పునఃప్రారంభ‌మ‌య్యాయి. క‌రోనా నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు.

ఆర్జిత‌పూజ‌ల‌తోపాటు ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు, స‌త్యనారాయ‌ణస్వామి వ్ర‌తాలు సైతం కొనసాగుతున్నాయి. ప‌రిమిత సంఖ్య‌లోనే భక్తులకు టికెట్లు జారీచేస్తున్నారు. అభిషేకాలు, అర్చ‌న‌లు, క‌ల్యాణాలు పున‌రుద్ధ‌ర‌ణ‌, సుద‌ర్శ‌న నార‌సింహ హోమం, జోడు సేవ‌లు, సువ‌ర్ణ పుష్పార్చ‌న పున‌రుద్ధ‌రించారు. భ‌క్తులు విధిగా మాస్కు ధ‌రించి, భౌతిక‌ దూరం పాటించాల‌ని ఆల‌య ఈఓ గీత కోరారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo