శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Jan 11, 2021 , 20:22:36

ఎములాడలో భక్తుల రద్దీ..

ఎములాడలో భక్తుల రద్దీ..

రాజన్న సిరిసిల్ల ‌: వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం భక్తులతో పోటెత్తింది. రాజన్నకు సోమవారం ప్రీతికరమైన రోజు కావడంతో వేకువజామునే రాష్ట్ర నలు మూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. క్యూలైన్లలో నిలబడి కరోనా నిబంధనలు పాటిస్తూ డిస్‌ఇన్‌ఫెక్షన్‌ టెన్నెల్‌ ద్వారా ఆలయం లోనికి ప్రవేశించారు. స్వామివారిని దర్శించుకొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అనుబంధ ఆలయాలు బద్ది పోశమ్మ, భీమేశ్వర, నగరేశ్వరస్వామి ఆలయాలకు చేరుకొని పూజలు చేశారు.  కాగా, సోమవారం సుమారు 20 వేల మంది భక్తులు రాజన్నను సందర్శిం చుకున్నారని ఆలయ ఏఈవో హరికిషన్‌ తెలిపారు. రూ. 16 లక్షల ఆదాయం సమకూరిందని వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకల సౌకర్యాలు కల్పించామని చెప్పారు. 

ఇవి కూడా చదవండి..

ప్రభుత్వ పథకాల అమలులో ఎంపీడీవోలు కీలకం

మిషన్ భగీరథ పెండింగ్ పనులను పూర్తి చేయండి 

కూతురు పరీక్ష కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు 

క్రికెట్ ఆడుతూ యువకుడు మృతి 


logo