శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Nov 01, 2020 , 10:19:15

కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

జయశంకర్‌ భూపాలపల్లి : జిల్లాలోని శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా త్రివేణి సంగమం.. గోదావరి నది తీరాన పుణ్యస్నానాలు నిర్వహించారు. అనంతరం నదిలో దీపాలు వదిలారు. పలువురు భక్తులు పెద్దలకు పితృకర్మ పూజలు చేశారు. అనంతరం కాళేశ్వర ముక్తేశ్వరస్వామి వారలను దర్శించుకున్నారు. ఆలయంలో అభిషేక పూజలు, సుబ్రమణ్య స్వామి వారి ఆలయంలో నవగ్రహ పూజలు, పార్వతీ అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజల్లో భక్తులు పాల్గొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.