మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Aug 26, 2020 , 20:58:33

భూపాల‌ప‌ల్లిలో 34,337 ఎక‌రాల్లో పంట న‌ష్టం

భూపాల‌ప‌ల్లిలో 34,337 ఎక‌రాల్లో పంట న‌ష్టం

జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి : ఇటీవ‌ల ఎడ‌తెరిపిలేకుండా కురిసిన వ‌ర్షాల కార‌ణంగా జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలో ప్రాథ‌మిక అంచ‌నా ప్ర‌కారం 17,798 మంది రైతుల‌కు చెందిన‌ 34,337 ఎక‌రాల్లో పంట న‌ష్టం వాటిన‌ట్లు అధికారులు తెలిపారు. వ‌రి, ప‌త్తి పంట‌ల‌కు తీవ్ర న‌ష్ట వాటిల్లిన‌ట్లు సుమారు 16.25 కోట్ల మేర పంట న‌ష్టం జ‌రిగిన‌ట్లు చెప్పారు. అదేవిధంగా 1,124 ఇండ్లు పాక్షికంగా దెబ్బ‌తిన‌గా మ‌రో 104 ఇళ్లు పూర్తిగా కూలిపోయ‌య‌న్నారు. జిల్లా క‌లెక్ట‌ర్ మ‌హ్మ‌ద్ అబ్దుల్ అజీం బుధ‌వారం నాడు జామ్‌న‌గ‌ర్ నుంచి మీనాజీపేట గ్రామాల మ‌ధ్య దెబ్బ‌తిన్న ర‌హ‌దారిని ప‌రిశీలించారు. అదేవిధంగా మ‌హాముత్తారం మండ‌లంలోని కృష్ణాపూర్ గ్రామంలో దెబ్బ‌తిన్న పొలాల‌ను ప‌రిశీలించారు. అనంత‌రం క‌న‌నూర్ గ్రామాన్ని క‌లెక్ట‌ర్ సంద‌ర్శించారు.


logo