శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 21, 2020 , 13:23:13

అకాల వర్షాలు.. పంట పొలాలకు తీవ్ర నష్టం

అకాల వర్షాలు.. పంట పొలాలకు తీవ్ర నష్టం

యాదాద్రి భువనగిరి : జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షాలకు పంటల పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. బొమ్మల రామారం, ఆలేరు, యాదగిరిగుట్ట, రాజపేట, తుర్కపల్లి మండలాల్లో నిన్న రాత్రి వడగండ్ల వాన కురిసింది. దీంతో వరి, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లగా, మామిడి తోటలు నేలకొరిగాయి. వరి పొలాల్లోకి నీరు రావడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందారు. యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురం, మల్లాపురం, మైలారిగూడం గ్రామాల్లో నష్టపోయిన పంట పొలాలను ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌ రెడ్డి పరిశీలించారు. ప్రభుత్వం తరపున ఆదుకుంటామని మహేందర్‌ రెడ్డి రైతులకు భరోసానిచ్చారు. పంట నష్టం వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టం వివరాలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి రైతులకు అందరికి పరిహారం అందేలా చూస్తామని మహేందర్‌ రెడ్డి చెప్పారు.logo