శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 15:31:57

దండిగా దిగుబడి : మంత్రి కొప్పుల ఈశ్వర్‌

దండిగా దిగుబడి : మంత్రి కొప్పుల ఈశ్వర్‌

పెగడపల్లి : ఈ సారి కూడా పంటలు పుష్కలంగా పండడంతో దిగుబడులు పెరిగాయని రాష్ట్ర షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నర్సింహునిపేట, మ్యాక వెంకయ్యపల్లి, రాంనగర్‌, పెగడపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం ధాన్యాన్ని మార్క్‌ఫెడ్‌ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు. ధాన్యం దిగుబడి రాష్ట్రం మొత్తం మీద బాగా పెరిగిందని, జగిత్యాల జిల్లాలోనే 1.20లక్షల మెట్రిక్‌ టన్నులు పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని సేకరించడం జరుగుతుందని, ఇందుకు అధికారులు పకడ్బంధీ చర్యలు చేపట్టారని మంత్రి పేర్కొన్నారు. వీలైనంత త్వరలోనే డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి వివరించారు. అలాగే నాలుగైదు రోజుల్లో అన్ని చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని మంత్రి హామీ పేర్కొన్నారు. అనంతరం వరి కోత, శుద్ధి యంత్రాలను మంత్రి ప్రారంభించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.